Monday, October 12, 2009

యూ టూ నోబెల్!!!!

ఒక ఐదారు నెలల క్రితం ఒక వార్త చదివాను. సరిగా గుర్తు లేదుగాని, హిందీ నటి రేఖకి ఆమధ్య ఎవరొ "లైఫ్ టైం అచీవ్మెంట్" అవార్డు ప్రదానం చేస్తామంటె ఆమె వారిమీద చిర్రు బుర్రు లాడిందట. "అసలు నావయసెంతనుకుంటున్నారు, అలా "లైఫ్ టైం అచీవ్మెంట్" అవార్డులిస్తే నా అభిమానులు నేనేదో ముసలిదాన్నయి పోయినట్టూ , నేడో రేపో నేను ఈ సినిమా రంగం నుంచి నిష్క్రమిస్తున్న్నట్టూ అనుకోరూ" అంటూ ఆ అవార్డుని తిరస్కరించిందట. పాపం ఆ అవార్డు కమిటీలో రేఖమ్మగారి వీరాభిమాని ఎవరో ఉన్నట్లున్నాడు. ఎలాగైనా ఆమెకేఇవ్వాలని పట్టుబట్టుబట్టాడేమో గాని, కమిటీ వారికొక బ్రహ్మాండమయిన అవిడియా తట్టింది.

అదేమిటంటే..

ఏకంగా ఆ అవార్డు పేరు మార్చటం.

"లైఫ్ టైం అచీవ్మెంట్" తీసేసి ఇంకేదో పేరు పెట్టి మొత్తానికి ఆ అవార్డు ఆమెకే ఇచ్చేసారు. ఇలాఉంటాయి మనవాళ్ళ యవ్వారాలు.

ఇలాంటివి చాలా విన్నాను కాబట్టి నాకు వాటిమీద అంతగా నమ్మకం లేదు. కానీ నాకు ఊహ తెలిసినప్పటినుంచీనోబెల్ బహుమతి అంటే చాలా గౌరవం. అర్హులకు మాత్రమే ఇస్తారు అని నాకు మాగట్టి నమ్మకం. ఆమధ్యెప్పుడో మహాత్మా గాంధీ గారికి ఇవ్వాల్సింది, ఇవ్వలేదు. అది మా తప్పిదమే అని నోబెల్ కమిటీ విచారం ప్రకటించింది అని కూడా విన్నాను. సరే అని ఈటపా రాయటానికి ముందు గూగులిస్తే , ఆశ్చర్యం,నోబెల్ కి కూడా బోలెడన్ని వివాదాలు.

అవన్నీ ఒకెత్తు, ఈసారి శాంతి బహుమానానికి ఒబామాని ఎన్నుకోవటం ఇంకొకెత్తు అనిపించింది. ఏం సాధించాడని ఈ బహుమతి ప్రకటించారో అర్ధంకాదు. చూస్తుంటే పైన చెప్పిన రేఖమ్మ గారి అభిమాని తరహా తలతిక్క వ్యక్తులు ఈ నోబెల్ కమిటీలోనూ ఉన్నారని మాత్రం అర్ధమయింది.

ఒబామా తిరస్కరించిఉంటే చాలా బావుండేది అనిపించింది నాకు.

4 comments:

చిన్ని said...

మా రేఖ గురించి కామెంట్ చేసేదెవరు ....?మేము వురుకోము .....ఆవిడన్నది మేము సమర్ధిస్తాము.....సిల్ సిల తో పడిపోయాం .

sunita said...

నాకూ ముందు ఆశ్చర్యమనిపించిందండీ. ఎందుకు ఒబామా కు పిలిచి మరీ ఇచ్చారు అని?

పరిమళం said...

ప్చ్ ...

భావన said...

ముందు గా నూతన్ బ్లాగ్ నిర్మాణ, ప్రవేశ శుభాకాంక్షలు అండి.
తిరస్కరించటం బాగోదు అందుకని తీసుకున్నాడు ఒబామా అనుకుంటున్నా. అడకత్తెర లో పోక చెక్క లాంటిది కదా ఆయన పరిస్తితి.. మొన్నీ మధ్య న ఎక్కడో చదివేను నోబెల్ బహుమతి తీసుకున్నాక ఒబామా అడుగుతాడట ఆ ఇచ్చిన ఆయనను అవును నాకెందుకు ఇచ్చారు అని. ఆయన సమాధానం " ఎప్పుడూ మాములు మనుష్యు లు కూడ అసాధారణం గా వెలిగినప్పుడు ఇస్తాము కాని అసాధారణమైన పదవి లో వుండి ఎన్నో చెయ్యగల నువ్వు సాధారణం గా అలా నానుస్తూ వుండటం కూడా గొప్పే కదా అందుకని ఇచ్చాము" అని. తెగ నవ్వు కున్నా అది చదివి నేనైతే.

Post a Comment