Monday, October 12, 2009

న్యూ హేంప్ షైర్ ఫాల్ అందాలు














పోయిన వారాంతం ఫాల్ కలర్స్ చూద్దామని మాకు దాదాపు మూడున్నర గంటల దూరంలో ఉన్న న్యూ హాంషైర్ లోని వైట్ మౌంటైన్స్ అనే ప్రదేశానికి వెళ్ళాం. ఇక్కడ కనెక్టికట్ లో ఉన్న మూడేళ్లలో వెళదామనుకున్న ప్రతిసారీ ఏదో అవాంతరం ఏర్పడి కుదర్లేదు. ఈసారి వెళ్లి అక్కడి ప్రకృతి అందాలు చూస్తున్నప్పుడు , ఇన్నేళ్ళు ఇక్కడే ఉండి , వీటిగురించి విని కూడా వైట్ మౌంటైన్స్ ని దర్శించకపోవడం క్షమించరాని నేరమనిపించింది. ఎటు వైపు చూసినా పసుపు, ఎరుపు అక్కడక్కడ పచ్చగా కళ్ళు చెదిరిపోయే అందాలు. ఎటు తలతిప్పినా కేమెరాలో బంధించాల్సిందే అనిపించే అందాలు. నాకు బాగా నచ్చింది మాత్రం మౌంట్ వాషింగ్టన్ . సముద్ర మట్టానికి ఆరు వేల అడుగుల ఎత్తులో, నిమిష నిమిషానికీ మారే వాతావరణంతో, విపరీతమైన వీచే గాలులతో , దట్టమైన పొగమంచుతో వాహ్ అనిపించింది నాకు. కారు దిగ్గానే ఆ గాలికి ఎక్కడ ఎగిరిపోతానో అని కారు డోరుని కాసేపు అలానే గట్టిగా పట్టుకొని ఉండాల్సొచ్చింది. పైగా వణుకు పుట్టించే చలి .తరువాత నాకు నచ్చిందీ అంటే kancamagus highway scenic drive.

చివరి మూడు ఫోటోలు మౌంట్ వాషింగ్టన్ ఎక్కుతున్నప్పుడు మధ్యలో కారు ఆపి తీశాను. కొన్ని మౌంట్ వాషింగ్టన్ దిగుతుండగా , మిగతావి kancamagus highway లో అక్కడక్కడ తీసినవి. చూసి ఆనందించండి. (ఫోటో మీద క్లిక్ చేస్తే ఫోటో పెద్దది అవుతుంది.)

9 comments:

చిన్ని said...

మిమ్మల్ని చూసి చాల చాల ఈర్ష్య పడుతున్న ....నీలిమేఘాలు అధ్బుతం .

భాస్కర్ రామరాజు said...

అదిరిందయ్యా చంద్రం!!!

sunita said...

ప్చ్.. మేం మిస్స్ అయ్యామండి. కాకుంటే డఫోడిల్ ఫెస్టివల్ కు వెళ్ళాము

sunita said...

అద్భుతం!! చాలా బాగున్నాయి.

కొత్త పాళీ said...

cool.
Next time, try Vermont.

జయ said...

ఎంతచక్కటి అందాలో. నాకు కశ్మీర్ గుర్తుకొస్తోంది. మీరు రోజుల తరబడి అక్కడే గడిపేయొచ్హు కదూ!

పరిమళం said...

Beautiful!

శ్రీనివాస్ చింతకింది said...

నాది కూడా అచ్చం మీ లాంటి అనుభవమే. గత రెండుల్లగా ఇక్కడ న్యూజెర్సీ లో ఉంటూ కూడా ఫాల్ కలర్స్ కి న్యూ హంప్శైర్ వెళ్ళలేక పోయాము. ముఖ్యంగా నాకు ౪-౫ గంటల డ్రైవ్ అంటే బద్ధకం. కాని మీ ఫోటోలు చూసాక వెళ్ళలేక పోయినందుకు బాధ పడుతున్నాను.

భావన said...

వో మా వూరు వచ్చారా? నైస్.. బాగున్నాయి ఫొటో లు మేము కూడా అదే శని వారం వెళదామనుకున్నాము ఒకటే వాన కదా, ఆది వార మనుకున్నాము కాని మా అబ్బాయి కి ఏదో క్లాస్ వుండటం తో బద్దకించేము.. తరువాతి శనివారం వెళ్ళేము. ఫొటో లు బాగున్నాయి నేను కూడా ఒక పోస్ట్ రాద్దామనుకున్నా కాని మాములేగా బద్దకం. :-)

Post a Comment