Sunday, November 1, 2009

దెయ్యాల పండగ

నిన్న ఇంటర్నెట్లో ఏదో వెతుకుతూ ఉంటే తెలుగు FM రేడియో తాలూకు లింకు కనపడింది. మూడో నాలుగో స్టేషన్లు కనపడ్డాయి. నాకుగుర్తుండి "రేడియో మిర్చీ" లింకు నొకినట్టున్నాను. రేడియో జాకీ ఇంగ్లీషూ, తెలుగూ కలగలపిన సంకర భాషలో ఏదేదో వాగేస్తోంది. నిన్న ఇక్కడ అమెరికాలో హేలోవిన్ ( దెయ్యాల పండగ). ఆ రేడియో జాకీ కూడా ఈ పండగ గురించే చెప్తోంది.

"You can wear any costume ..like...witch, vampire, or a "hot nurse" " అంటూ ఏదేదో చెప్తోంది. నాకర్ధంగానిది ఈ దెయ్యాలపండుగ ఇండియాలో కూడా కాలూనిందా? అని. లేక ఈ ప్రోగ్రాము ప్రవాస భారతీయులనుద్దేసించి రూపొందించబడిందా? నేను ఈ FM స్టేషన్లు పెద్దగా వినను, కాబట్టి నాకు వారి కార్యక్రమల వివరాలు తెలీవు. దీన్ని ఇండియాలోకూడా జరుపుకుంటున్నారంటే నావరకు నాకు ఇదో పెద్ద వింతే..

9 comments:

చిన్ని said...

మనము ఇప్పుడే వినటం ..వినడానికే ఒళ్ళు జలదరిస్తుంది ...ఎందుకంటే దెయ్యం అంటే నాకు భయం కనుక -:)

AMMA ODI said...

దయ్యాల పండగ విషయం నాకు తెలియదు కాని, మా ఊర్లో[నంద్యాల, ఆ.ప్ర.] మాత్రం క్రైస్తవులు సమాధుల పండుగని ఈరోజు జరుపుకుంటున్నారు. గతించిన తమ వారి సమాధులని శుభ్రంచేసి, రంగులు వేసి, దీపధూపాలతో ప్రార్ధనలు చేస్తున్నారు.

Anonymous said...

ikkada lonodn lo kuda jargindanndi.aslu i pandag enduku chesukuntaro kuda evariki teliayadu.purreko budhhi ,jhivako ruchi antaru kada.

ఉమాశంకర్ said...

వ్యాఖ్యానించిన అందరికీ ధన్యవాదాలు.

@అమ్మవొడి: నా బ్లాగులో మీ మొట్టమొదటి వ్యాఖ్య అనుకుంటా. సంతొషం.

@anonymous నిజానికి ఈ పండగ పుట్టిందే ఐర్లాండ్లో అనుకుంటా అండీ..కాబట్టి అక్కడ జరుపుకోవటంలో వింత లేదు.

భావన said...

ఇండియా లో కూడా నా హాలోవిన్? రామ చంద్రా.. ఆ మిర్చి స్టేషన్ ఇండియా కు సంబంధించినదే అనుకుంటా మన కోసం కాదు అనుకుంటా ఉమ గారు. ఆ పండు గ రోజు మన పల్లెటూళ్ళ లో జరుపుకోవాలంటే ఒకామె నల్ల చీర కట్టుకుని "నూకాలమ్మ ను నేను నీ పీకను నొక్కేస్తాను చీపురు కట్ట తో సింగారించి " అంటూ పాట పాడుతూ తిరగాలా?: బావుంది బావుంది.. :-)

పరిమళం said...

నాకూ ఇప్పుడే తెలిసింది ఈ సాంప్రదాయం మనకూ అంటిందని !మా ఫ్లాట్ లో పిల్లలు దయ్యాల్లా వేషాలేసుకొని చాక్లెట్లు దండుకోవటానికి వచ్చారు మరి !

ఉమాశంకర్ said...

@భావన గారు: పరిమళం గారు కన్ ఫం చేసేసారు. ఇక ముందు ముందు ఎలాంటి కొత్త "డే" లను చూడబోతున్నామో కదా...ధన్యవాదాలు.

పరిమళం గారు : హమ్మయ్య, మొత్తానికొచ్చేసారు. గతకొన్ని రోజులుగా మీరు కనపడలెదు మాకు. ధన్యవాదాలు.

AMMA ODI said...

ఉమా శంకర్ గారు,

మీ టపాలు చదువుతూనే ఉంటాను. నెనర్లు!

విజయభారతి said...

dasara puli veshalu manesi, leni ee deyyam veshayalu veyatam emito? masikalani, taddinalani, peddalakani evariki varu chesukuntune vuntaruga malli ee deyyam pandugalu endukata. pillalu chocolates dandukuni dantalu puchu pattinchukotaniki kakapotey. aina atla taddi manake, halloween manake ante ela? premikula roju jarupukunnaranta oka artham vundi. ee mathi leni janalaki evaru cheppalo ento. soubhratrutvam maree ekkuvaina kashtame.

Post a Comment