అప్పుడెప్పుడో జంధ్యాల, విశ్వనాథ్ , ఆ తరువాత మణిరత్నం సినిమాలు మినహాయించి గత కొన్నేళ్లుగా పలానా సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసిన గుర్తు లేదు. ఈ "అవతార్" సినిమా కోసం మాత్రం డిసెంబరు మొదటినుంచే ఎప్పుడు రిలీజవుతుందా అని ఎదురుచూసా. రిలీజయిన రోజే చూసేసా. మొత్తానికి నిరాశే మిగిల్చింది. బహుశా మరీ ఎక్కువ ఊహించుకున్నందువల్లనేమో అనిపించింది మొదట్లో. తరువాత ఆలోచిస్తే అనిపించింది అదేమాత్రం కారణం కాదని.
సినిమాలో వాడిన గ్రాఫిక్ వర్కుని మినహాయిస్తే కథా, కథన పరంగా ఇదొక "బి" గ్రేడు సినిమా. ఇంత నాసిరకం కథనాన్ని కేమరూన్ నుంచి ఊహించలేదు. బహుశా గ్రాఫిక్స్ మీద పెట్టిన శ్రద్ద కథనాన్ని దెబ్బ తీసిందేమో. అద్భుత ప్రపంచాన్ని సృష్టించినా ( నాకలా అనిపించలేదనుకోండి),కథలో లీనం కాలేనప్పుడు ఏమి లాభం. కథ మొదట్లో మనకి పరిచయం చేసే ఆ వింత జంతువులు చివర్లో ఆ గ్రహాన్ని ఆక్రమించుకోవటానికి వచ్చిన శత్రువులని ( మనుష్య జాతిని ) తరమడానికే అన్నట్లు అనిపిస్తుంది. అలానే హీరోని గ్రూపు లీడరుగా అంగీకరించేలా చేయడానికి హడావిడిగా ఆయన్ని ఆ ఎర్ర డ్రాగన్ ( అది డ్రాగనో ఇంకేదో ) ఎక్కించినట్టు అనిపిస్తుంది. మొదటినుంచి చిన్న సమూహంలా అనిపించే పెండురా గ్రహవాసులు తెగలు తెగలుగా బోల్డుమంది ఉన్నట్టు చెప్పడం క్లైమాక్సు కోసమే అనిపిస్తుంది. మరీ హీరో ఒక్కడే ఒంటి చేత్తో శత్రువులని చితకబాదినట్టు చూపిస్తే బాగోదని అర్జెంటుగా ఇంకో కేరక్టరు ( తెగ నాయకుడు ) సహాయం తీసుకున్నట్లనిపిస్తుంది. ఇలాంటివి చేయకూడదని కాదు. దేన్నైనా అలవోకగా అల్లినట్టు చెప్పాలిగాని, అతుకేసి కుట్టినట్లుగా కాదు. ఇలా చెప్పదలచుకుంటే చాలా ఉన్నాయి.
బహుశా ఆ అద్భుత ప్రపంచాన్ని సృష్టించటానికి కేమరూన్ చాలా కష్టపడి ఉండొచ్చు. దానికి వాడిన టెక్నాలజీ భవిష్యత్ తరానికి బైబిలు లాంటిదే కావచ్చు. కానీ ఆ తెరవెనుక విషయాలు నాలాంటి సగటు ప్రేక్షకునికి అనవసరం. ఈ కథ గత పదేళ్లుగా కేమరూన్ మదిలో నలుగుతున్నది అంటే అంగీకరించటం కష్టమే.
నేను ఈ సినిమా త్రీడీ లోనే చూసా. ఇప్పుడొస్తున్న మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలోని గ్రాఫిక్స్ చాలా బావున్నాయిగాని, మిగతా సినిమాల్లోని గ్రాఫిక్స్ ఒకెత్తు, ఇవి ఇంకో ఎత్తు అన్నంత వైవిధ్యంగా ఏమీలేవు. (నా దృష్టిలో ఇప్పటికీ టెర్మినేటర్-2 గ్రాఫిక్స్ పరంగా అద్భుతమయిన సినిమా.)
ఏదో నా ఆసక్తి కొద్దీ ఇంకో విషయం. కొన్ని సినిమాలకు ఒక సిగ్నేచరు ట్యూన్ ఉంటుంది. ( దాన్ని సినిమా పరిభాషలో ఏమంటారో నాకు తెలీదు). Troy ( కొత్తది) సినిమాలో ఒక ట్యూన్, మక్కీకి మక్కీ అదే ట్యూన్"Enemy at the gates సినిమాలో, సినిమా అంతా రిపీటెడ్ గా వినబడుతూ ఉంటుంది( వింటానికి చాలా బాగుంటుంది అది). అదేట్యూన్ ఈ సినిమా మొదట్లో ఒక క్షణకాలం వినబడుతుంది. అలానే సినిమా మధ్యలో టైటానిక్ సినిమాలో వాడిన మరో ట్యూన్.
చివరగా ఈ సినిమా ఇచ్చే సందేశం? ?? నాకయితే ఏరకమయిన సందేశం కనిపించలేదు. ఆయన దేన్నైతే అనుకున్నాడో, దాన్ని ఆయన అనుకున్న స్థాయికి తగ్గకుండా తీసినట్టు అనిపించింది. అంతే..

2 comments:
హమ్మయ్యా..అవతార్ నచ్చని వాళ్ళు చాలా మందే వున్నారన్నమాట.మనం ఆశించినట్టు లేని సినిమాలు చాలా వున్నా ,ఇంతకంటే ఎక్కువ డబ్బులు పెట్టుకుని వెళ్ళి చూసినా....ఎందుకో ఈ సినిమా బాగోలేకపోయే సరికి నాకు చాలా చిరాకు,కోపం వచ్చేసాయి.
అభిమానులు కొట్టినా కొట్టగలరు నా వ్యాఖ్య చూస్తే...:) అయినా సరే హమ్మయ్యా...నా అభిప్రాయంతో ఏకీభవించేవాళ్ళు ఉన్నారన్నామాట అనుకున్నా మీ టపా చూసి...!
Post a Comment